జగన్ గారూ, ఈ సమస్యను స్వయంగా మీరే పరిష్కరించండి: సీపీఐ రామకృష్ణ

జగన్ గారూ, ఈ సమస్యను స్వయంగా మీరే పరిష్కరించండి: సీపీఐ రామకృష్ణ
  • ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది
  • అయినా ఆ కార్యక్రమం విజయవంతమయింది
  • ఉద్యోగులతో మీరే చర్చలు జరపండన్న రామకృష్ణ  
ఉద్యోగ సంఘాల నేతలతో స్వయంగా మీరే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. ఉద్యోగులు శాంతియుతంగా నిర్వహించాలనుకున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు మీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసిందని.. అయినప్పటికీ చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమయిందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమస్యను స్వయంగా మీరే పరిష్కరించాలని కోరారు.


More Telugu News