ఉద్యోగుల సమ్మెపై మంత్రులతో సీఎం జగన్ కీలక సమావేశం

  • డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమం
  • ఈ నెల 6 నుంచి నిరవధిక సమ్మె
  • ప్రత్యామ్నాయాలపై చర్చించిన సీఎం జగన్
ఫిబ్రవరి 6 నుంచి సమ్మె ఖాయమంటూ ఉద్యోగులు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. కాగా, ఉద్యోగులు చర్చలకు రాకుండా సమ్మెకు వెళితే ప్రత్యామ్నాయాలు ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలను సీఎం జగన్ మంత్రులతో చర్చించారు.

ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేయడం తెలిసిందే. ప్రభుత్వం మాత్రం తాము ఇప్పటికీ చర్చలకు సిద్ధంగానే ఉన్నామని చెబుతోంది. సీఎంతో సమావేశం అనంతరం మంత్రుల బృందం సచివాలయానికి వెళ్లింది.


More Telugu News