'చంద్రకళ'గా మెరిసిపోతున్న అనసూయ!

  • రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి'
  • రవితేజ సరసన ఇద్దరు నాయికలు
  • ప్రత్యేకమైన పాత్రలో అనసూయ
  • ఈ నెల 11వ తేదీన విడుదల  
అనసూయ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 'రంగస్థలం' సినిమా నుంచి ఆమెకి కీలకమైన పాత్రలు దక్కుతున్నాయి. ఆ సినిమాలో రంగమ్మత్తగా పాత్రకి తగినట్టుగా అలరించిన ఆమె, 'పుష్ప'లో దాక్షాయణిగా కనిపించింది. అయితే ఆమెను గ్లామరస్ గానే చూడాలనుకున్న అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.

అలాంటి ప్రేక్షకులు 'చంద్రకళ'గా అనసూయను చూస్తే ఫుల్ ఖుషీ కావడం ఖాయమేనని అనిపిస్తుంది. రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలో, అనసూయ 'చంద్రకళ' పాత్రలో కనిపించనుంది. ఇది రవితేజకి అత్త పాత్రని అంటున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి అనసూయ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బ్లాక్ శారీలో నిండుగా కనిపిస్తూ .. ఒకింత సిగ్గుపడుతున్న ఈ పోస్టర్ లో అనసూయ చాలా అందంగా కనిపిస్తోంది. చూడబోతే ఈ సినిమాకి అనసూయ లుక్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది.


More Telugu News