యూపీలో ఒవైసీ వాహనంపై కాల్పులు... ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందన
- యూపీలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం
- మీరట్ జిల్లాలో అసద్ కారుపై కాల్పులు
- గతంలో అసద్ సోదరుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించిన విష్ణు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరగడం తెలిసిందే. మీరట్ జిల్లా కితౌర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఒవైసీకి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. కాగా, ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి కాస్త వ్యంగ్యంగా స్పందించారు.
"హలో ఒవైసీ గారూ... 15 నిమిషాలు పోలీసులను పక్కనబెడితే హిందువులకు గుణపాఠం నేర్పుతానని మీ తమ్ముడు అన్నాడు. మీరు కూడా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల తర్వాత యూపీ పోలీసులకు గుణపాఠం నేర్పాలని భావించారు. కానీ మీరే జెడ్ ప్లస్ భద్రత పొందాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా మీకు రక్షణ కల్పిస్తారులే. ఇప్పుడు మీకు నిజంగా సురక్షితంగా ఉన్నామన్న భావన కలుగుతుందని ఆశిస్తున్నా" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.