'ఛలో విజయవాడ' కార్యక్రమంతో ఏ రాజకీయ పార్టీకి సంబంధంలేదు: ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి

  • నిన్న ఉద్యోగుల 'ఛలో విజయవాడ'
  • లక్షమందితో విజయవంతం
  • ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న వెంకట్రామిరెడ్డి
ఛలో విజయవాడ కార్యక్రమంతో ఏ రాజకీయ పార్టీకి సంబంధంలేదని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. నిన్నటి 'ఛలో విజయవాడ' కార్యక్రమంలో టీడీపీ, జనసేన, మరే ఇతర పార్టీలకు చెందినవారు పాల్గొనలేదని అన్నారు. దీనిపై అసత్య ప్రచారం చేయవద్దని కోరారు. ఉద్యోగులకు మద్దతుగా పవన్ కల్యాణ్ వంటి వారు ఎవరు ముందుకు వచ్చినా మంచిదేనని వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు.

విజయవాడ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం లేదని, అయితే కొందరు వ్యక్తులు ఉద్యోగుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఛలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఆశించామని, ఇంతటి ఉద్యమ కార్యక్రమం తర్వాత కూడా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.


More Telugu News