అందుకే అసదుద్దీన్ ఒవైసీపై ఇద్దరు కాల్పుల ఘటనకు పాల్పడ్డారు: యూపీ పోలీసులు
- గత కొన్ని రోజులుగా ఒవైసీని ఫాలో అవుతున్నారు
- ర్యాలీల్లో ఒవైసీ ప్రసంగాలు వారికి నచ్చలేదు
- దీంతో దాడి చేయాలని భావించారు
- దాడి చేసే అవకాశం కోసం ఎదురు చూశారన్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై దాడి జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి వివరాలు వెల్లడించారు. నిందితులు గత కొన్ని రోజులుగా ఒవైసీని ఫాలో అవుతున్నారని దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒవైసీ నిర్వహించిన సభలు, ర్యాలీల్లో ఆయన చేసిన ప్రసంగాలు నచ్చకే నిందితులు ఆయనపై దాడి చేయాలని నిర్ణయం తీసుకుని, కాల్పుల ఘటనకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు.
సదరు నిందితులు ఒవైసీ నిర్వహించిన మీరట్ ర్యాలీతో పాటు గతంలో ఒవైసీ పాల్గొన్న పలు బహిరంగ సభలకు కూడా హాజరయ్యారని చెప్పారు. ఆయా ర్యాలీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిజానికి నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఒవైసీని ఫాలో అవుతున్నప్పటికీ ఆ సమయంలో దాడి చేసే అవకాశం వారికి రాలేదని తెలిపారు.