పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ హస్నాన్ పై సస్పెన్షన్ వేటు
- నిబంధనలకు అనుగుణంగా లేని బౌలింగ్
- ఆస్ట్రేలియా నుంచి పీసీబీకి అందిన నివేదిక
- పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు 'నో'
- సరిదిద్దేందుకు కన్సల్టెంట్ నియామకం
పాకిస్థాన్ బౌలర్ మహమ్మద్ హస్నాన్ ఇబ్బందుల్లో పడ్డాడు. నిబంధనలకు అనుగుణంగా అతడి బౌలింగ్ లేదని పరీక్షల్లో బయటపడింది. దీంతో అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడకుండా అతడిపై సస్పెన్షన్ (తాత్కాలిక నిషేధం) విధిస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది.
‘‘మహమ్మద్ హస్నాన్ బౌలింగ్ కు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అందుకున్నాం. గుడ్ లెంథ్ డెలివరీ, ఫుల్ లెంత్ డెలివరీ, స్లో బౌన్సర్, బౌన్సర్ లలో అతడి ఎల్బో ఎక్స్ టెన్షన్ 15 డిగ్రీల పరిమితి దాటినట్టు వెల్లడైంది’’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
తమ బౌలింగ్ నిపుణులతో సంప్రదింపుల అనంతరం ఈ సమస్య పరిష్కారమయ్యేదేనని గుర్తించినట్టు పీసీబీ పేర్కొంది. దీంతో హస్నాన్ కోసం పీసీబీ ఒక కన్సల్టెంట్ ను నియమించనుంది. తన బౌలింగ్ యాక్షన్ ను నిబంధనలకు అనుగుణంగా హస్నాన్ సవరించుకోవాల్సి ఉంటుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు కూడా హస్నాన్ ను అనుమతించడం లేదని, ఈ సమయం కూడా తన బౌలింగ్ మెరుగుపరుచుకోవడంపై అతడు దృష్టి సారించడానికి వీలవుతుందని పీసీబీ పేర్కొంది.