ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానా సినిమా!
- '1945' నేపథ్యంలో రానా సినిమా
- జనవరి 7న థియేటర్లకు
- ఆడియన్స్ నుంచి లభించని ఆదరణ
- ఈ నెల 7 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్
జయాపజయాల సంగతి అలా ఉంచితే, రానా మొదటి నుంచి కూడా విభిన్నమైన పాత్రలనే చేస్తూ వస్తున్నాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే '1945'. విభిన్నమైన కథాకథనాలతో సత్యశివ రూపొందించిన ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మించారు.
సంక్రాంతి సమయంలో జనవరి 7వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. నిర్మాణ దశలో ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ అంతగా రాలేదు. విడుదలకు ముందువరకూ అసలు ఈ సినిమాను రానా చేశాడనే సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇక రిలీజ్ డేట్ ఇచ్చిన తరువాత కూడా ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. దాంతో ఈ సినిమా ఇలా థియేటర్లకు వచ్చి అలా వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. సన్ నెక్స్ట్ లో ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, రానా సరసన నాయికగా రెజీనా కనిపించనుంది. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.