నాపై కాల్పుల దాడి అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతా: అసదుద్దీన్ ఒవైసీ
- ఒవైసీ ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు
- లోక్ సభలో ప్రస్తావించేందుకు స్పీకర్ ను సమయం కోరతానన్న ఒవైసీ
- దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామన్న పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిపై ఒవైసీ స్పందిస్తూ, ఈ అంశాన్ని లోక్ సభలో లేవనెత్తుతానని చెప్పారు. దాడి గురించి ప్రస్తావించేందుకు తనకు సమయం ఇవ్వాలని స్పీకర్ ను కోరతానని తెలిపారు.
మరోవైపు ఎంఐఎం ఔరంగాబాద్ (మహారాష్ట్ర) ఎంపీ ఇంతియాజ్ జలీల్ మాట్లాడుతూ ఒవైసీపై దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈ దాడులపై సమగ్రమైన విచారణ జరిపించాలని కోరుతూ ఎంఐఎం నేతలు ఆయా నగరాల పోలీసు కమిషనర్లకు మెమొరాండంలను సమర్పించనున్నట్టు తెలిపారు.