అమ్మాయిల ఫొటోలు పెట్టి నా ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- నా పేరు మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు
- డీపీగా అమ్మాయి ఫొటో పెట్టారు
- ఈ ఐడీ నాది కాదనే విషయాన్ని అందరూ గ్రహించండన్న జగ్గారెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కేటుగాళ్లు షాకిచ్చారు. ఆయన పేరుతో కొందరు ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు. అంతేకాదు డీపీగా ఒక అమ్మాయి ఫొటోను పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి షాకయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పేరు మీద ఎవరో ఫేక్ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేశారని తెలిపారు. డీపీగా ఒక అమ్మాయి ఫొటో పెట్టారని మండిపడ్డారు. అమ్మాయిల ఫొటోలు పెట్టి తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫేస్ బుక్ ఐడీ తనది కాదని... ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు. సైబర్ నేరగాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.