గుర్రంపై రామ్ చరణ్, బైక్‌పై ఎన్టీఆర్ దూసుకెళ్తోన్న వైనం.. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ పోస్టర్ ఇదిగో!
- మరో 50 రోజుల్లో కలుద్దాం
- ట్వీట్ చేసిన 'ఆర్ఆర్ఆర్'
- మార్చి 25న సినిమా విడుదల
దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందించిన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రుధిరం రణం) షూటింగ్ జరుగుతుండగా తీసిన ఫొటోను ఆ సినిమా యూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బైక్‌పై వెళ్తున్నట్లు ఈ ఫొటో ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీని ఇప్పటికే ఫిక్స్ చేసి మార్చి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 50 రోజుల్లో థియేటర్లలో కలుద్దామని ఆర్ఆర్ఆర్ టీమ్ పేర్కొంది. ఈ సారైనా ప్రకటించిన తేదీకి ఈ సినిమాను విడుదల చేయాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోసారి విడుదలను వాయిదా వేస్తే తట్టుకోలేమంటూ సెటైర్లు వేస్తున్నారు.
కాగా, ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. యంగ్ ఎనర్జిటిక్ హీరోలు చెర్రీ, తారక్ ఈ సినిమాలో నటిస్తుండడం, బాహుబలి సిరీస్ వంటి భారీ హిట్ తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
మరోపక్క, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. సినిమా విడుదల ప్రచార కార్యక్రమాలు జరిపినప్పటికీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుతోన్న నేపథ్యంలో ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' తో పాటు పలు పెద్ద సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి.