పోలీసులను అడ్డుపెట్టుకుని మమ్మల్ని ఆపలేరు: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి

  • హక్కుల కోసం సమావేశం పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు విధిస్తోంది?
  • పది రోజుల నుంచి మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు
  • విజయవాడకు వేలాది మంది ఉద్యోగులు వస్తున్నారన్న వెంకట్రామిరెడ్డి 
పే స్లిప్పులు చూస్తే కానీ జీతం పెరిగిందో, లేదో తెలుసుకోలేని అమాయక స్థితిలో ఉద్యోగులు లేరని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. న్యాయబద్ధమైన హక్కుల కోసం ఉద్యోగులు సమావేశం పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు విధిస్తోందని ఆయన నిలదీశారు. ఉద్యోగుల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకతను మూటకట్టుకుని ప్రభుత్వం సాధించేది ఏంటని ప్రశ్నించారు.

పది రోజుల నుంచి ఉద్యోగులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని... అందుకే నిరసన బాట పట్టామని చెప్పారు. తమకు న్యాయం చేయాలనే పోరాటం చేస్తున్నామని తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమానికి వేల సంఖ్యలో ఉద్యోగులు స్వచ్చందంగా వస్తున్నారని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమను ఆపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... పోలీసులతో తమను ఆపలేరని అన్నారు.


More Telugu News