ఫేక్‌న్యూస్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు?: ఆయా సంస్థ‌ల‌ను ప్ర‌శ్నించిన కేంద్రం

  • గూగుల్‌తో పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్‌పై ఆగ్ర‌హం
  • ఫేక్ న్యూస్‌ను తొలగించ‌డంతో జాప్యం
  • తామే అలాంటి వార్తలను తొలగించాల్సివస్తోందన్న‌ కేంద్రం
  • తమపై విమర్శలు వస్తున్నాయని వ్యాఖ్య‌
ఆన్‌లైన్‌లో ఎన్నో న‌కిలీ వార్త‌లు వ‌స్తుండ‌డంపై గూగుల్‌తో పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌శ్నించింది. ఆయా ప్లాట్‌ఫాంల‌లో ఫేక్ న్యూస్‌ను తొలగించ‌డంతో జాప్యం జ‌రుగుతోందని ఆగ్రహం వ్య‌క్తం చేసింది. తాము ఫేక్‌ న్యూస్‌గా పేర్కొన్నవాటిని తొలగించడంలో కూడా ఆయా సంస్థ‌లు విఫలమయ్యాయని కేంద్ర స‌ర్కారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆయా సంస్థ‌లు చర్యలు తీసుకోకపోవడంతో తామే అలాంటి వార్తలను తొలగించాల్సివస్తోందని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. దీంతో ఆ వార్త‌లు తొల‌గిస్తున్నందుకు తమపై విమర్శలు వస్తున్నాయని పేర్కొంది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం పలు యూట్యూబ్‌ చానెళ్లతో పాటు వివిధ‌ ట్విట్టర్, ఫేస్‌బుక్‌ అకౌంట్ల‌పై నిషేధం విధించింది. దీనిపై మరింత చర్చించి నిర్ణ‌యాలు తీసుకునేందుకు టెక్‌ కంపెనీలతో కేంద్ర స‌మాచార శాఖ తాజాగా స‌మావేశ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే త‌ప్పుడు వార్త‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది.



More Telugu News