వెస్టిండీస్ తో సిరీస్ కు ముందు టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన కీలక ఆటగాళ్లు!
- ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభంకానున్న వన్డే, టీ20 సిరీస్
- అహ్మదాబాద్ లో 6వ తేదీన 1,000వ వన్డే ఆడుతున్న భారత్
- ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కు కరోనా పాజిటివ్
వెస్టిండీస్ తో సొంత గడ్డపై మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను, మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ ఆడనుంది. అయితే, ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు ముందు భారత్ కు గట్టి షాక్ తగిలింది. ముగ్గురు కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెట్ బౌలర్ నవ్ దీప్ సైనీ (స్టాండ్ బై ప్లేయర్) కూడా కరోనా బారిన పడ్డాడు. మరో ముగ్గురు సపోర్ట్ స్టాఫ్ కు కూడా కరోనా సోకింది.
ఈ నేపథ్యంలో జట్టులోకి మయాంక్ అగర్వాల్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ఇండియా టీమ్ అహ్మదాబాద్ లో ఉంది. అక్కడ ఫిబ్రవరి 6న టీమిండియా 1,000వ వన్డే ఆడబోతోంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ కు ముందు భారత్ కు కరోనా షాక్ తగలడం టీమ్ మేనేజ్ మెంట్ ను, అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
జనవరి 31న వీరంతా అహ్మదాబాద్ కు చేరుకున్నారు. అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా... కీలక ఆటగాళ్లకు కరోనా సోకినట్టు తెలిసింది. కరోనా బారిన పడిన వారిలో ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ బి.లోకేశ్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు. కరోనా బారిన పడిన వారంతా పూర్తిగా కోలుకునేంత వరకు ఐసొలేషన్ లో ఉంటారని బీసీసీఐ ప్రకటించింది.