ఇంతమంది చనిపోయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదు: చంద్రబాబు

  • తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు దుర్మరణం
  • మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్
  • మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని వ్యాఖ్య
తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో కల్తీ జీలుగు కల్లు తాగి వీరు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా వైసీపీ ప్రభుత్వం సరిగా స్పందించలేదని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. జనాలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని అన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు.


More Telugu News