ఇలా ఉంటే ఒమిక్రాన్ సంకేతాలు కావచ్చు..!

  • గొంతులో గురగుర
  • తలనొప్పి, తల తిరగడం
  • ఆకలి కోల్పోవడం
  • జుట్టు రాాలే సమస్య
కరోనా ఒమిక్రాన్ తీవ్రత తక్కువ ఉండడాన్ని చూస్తున్నాం. ఎక్కువ మందిలో సాధారణ జలుబు రూపంలోనే కనిపిస్తోంది. లేదంటే దగ్గు, తలనొప్పి, బలహీనత ఇలా తీవ్రత కొద్దిగా ఉంటే చాలా మంది పట్టించుకోరు. సాధారణ ఫ్లూ వేరియంట్లలోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తుంటాయి. కనుక ఈ తరహా లక్షణాలు ఏవైనా కనిపిస్తే టెస్ట్ చేయించుకుని నిర్ధారించుకోవడం ఒక్కటే మెరుగైన మార్గం అవుతుంది.

‘‘గొంతులో గురు గుర అనిపించినా, దురదగా, బొంగురు పోయినట్టు ఉన్నా.. ముక్కు కారుతున్నా, తలనొప్పి, నిస్సత్తువ, శారీరక నొప్పులు ఉంటే ఒమిక్రాన్ కావచ్చు. ఈ లక్షణాలు ఉన్న వారు పరీక్ష ద్వారా నిర్ధారించుకోవాలి’’ అని బ్రిటన్ కు చెందిన జోయ్ సింప్టమ్స్ స్టడీ యాప్ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టార్ సూచించారు.

కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా వెంటవెంటనే ఇవే తరహా లక్షణాలతో బాధపడుతుంటే అది కచ్చితంగా ఒమిక్రాన్ అయి ఉండొచ్చు. సాధారణ ప్లూలలో కుటుంబ సభ్యులు అందరూ ఏకకాలంలో బాధితులుగా మారిపోవడం అరుదుగానే ఉంటుంది.

ఉదర సంబంధిత సమస్యల రూపంలో కరోనా బయటపడొచ్చు. తలతిరగడం, వాంతులు, ఆకలి కోల్పోవడం ఒమిక్రాన్ కేసుల్లో కనిపిస్తున్న లక్షణాలుగా జోయ్ యాప్ స్టడీ చెబుతోంది.

కరోనా బాధితుల్లో హెయిర్ ఫాల్ సమస్య కూడా కనిపిస్తోంది. వైరస్ కారణంగా విడుదలైన సైటోకైన్స్ ప్రభావం వల్ల ఇలా జరగొచ్చు.


More Telugu News