ఉద్యోగ సంఘాల పిలుపు నేపథ్యంలో.. విజయవాడకు వెళ్లే మార్గాల్లో పోలీసుల మోహరింపు
- రేపు 'ఛలో విజయవాడ'కు ఉద్యోగ సంఘాల పిలుపు
- పీఆర్సీపై ఇచ్చిన జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- ఇప్పటికే విజయవాడకు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు
- విజయవాడకు వెళ్లే మార్గాల్లో పోలీసుల తనిఖీలు
విజయవాడకు వెళ్లే వివిధ మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన జీవోలు వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు రేపు 'ఛలో విజయవాడ' కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
అయినప్పటికీ, ఈ రోజు ఉదయం నుంచే పలువురు ఉద్యోగ సంఘాల నేతలు నగరంలో ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. దీంతో అనంతపురం నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో పోలీసులు మోహరించారు. ఆయా మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బుక్కరాయ సముద్రం, నార్పల క్రాస్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. హిందూపురంలో ఎన్జీవో నేత నరసింహులును గృహ నిర్బంధం చేశారు. అలాగే, కడప నుంచి విజయవాడకు వెళ్లకుండా ఉద్యోగ సంఘాల ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు.
ఒంగోలులో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శరత్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నెల్లూరు, గూడూరులో ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.
అలాగే, వాకాడు, వరికుంటపాడులో ఉద్యోగులను ముందస్తు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉపాధ్యాయులను హౌస్ అరెస్టు చేసి, పోలీసులు మోహరించారు. మరోపక్క, పలువురు ఉద్యోగ సంఘాల నేతలు గత అర్ధరాత్రి నుంచే విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో, నెల్లూరు నుంచి ఇప్పటికే కొందరు ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు.