శివ నిర్వాణతోనే విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ!
- ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండ
- పూరి 'లైగర్' పై భారీ అంచనాలు
- శివ నిర్వాణకి గ్రీన్ సిగ్నల్
- త్వరలోనే సెట్స్ పైకి
విజయ్ దేవరకొండ చాలా తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన 'డియర్ కామ్రేడ్' .. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు ఆశించినస్థాయిలో ఆడలేదు. ఆ తరువాత సినిమాను ఆయన పూరితో చేస్తున్నాడు. 'లైగర్' టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ తరువాత సినిమాను కూడా ఆయన పూరితోనే చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. 'లైగర్' తరువాత ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉండనుందనే టాక్ ఇంతకుముందే వచ్చింది. తాజాగా స్క్రిప్ట్ లాక్ చేసినట్టుగా చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కలిసి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారు. శివ నిర్వాణ నుంచి వచ్చిన 'నిన్నుకోరి' .. 'మజిలీ' యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తరువాత చేసిన 'టక్ జగదీశ్' ఫ్యామిలీ ఆడియన్స్ తో ఫరవాలేదనిపించుకుంది. ఇక విజయ్ దేవరకొండతో చేసే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.