మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్టే: బండి శ్రీనివాసరావు

మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్టే: బండి శ్రీనివాసరావు
  • మంత్రుల కమిటీతో నేడు పీఆర్సీ సాధన సమితి సమావేశం
  • సమావేశం వివరాలు తెలిపిన బండి శ్రీనివాసరావు
  • పాత అంశాలే ప్రస్తావించారని వెల్లడి
  • ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని వివరణ
పీఆర్సీ సాధన సమితి నేతలు ఇవాళ ఏపీ మంత్రుల కమిటీతో సమావేశం కావడం తెలిసిందే. సమావేశం జరిగిన తీరుతెన్నులపై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పందించారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్టేనని అన్నారు. గతంలో చర్చలకు పిలిచి ఏంచేశారో ఇప్పుడూ అదే చేశారని విమర్శించారు.

కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్టు పదేపదే చెప్పామని వివరించారు. నేటి సమావేశంలోనూ పాత అంశాలపైనే మాట్లాడారని బండి శ్రీనివాసరావు తెలిపారు. అయితే తాము చెప్పిన 3 ప్రధాన అంశాలపై తేల్చాలని స్పష్టం చేశామని చెప్పారు. ఆ మూడు అంశాల పరిష్కారం సాధ్యపడదని చెప్పారని వివరించారు.

ఈ నేపథ్యంలో, ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3న తలపెట్టిన ఛలో విజయవాడ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసే ప్రయత్నాలు చేయవద్దని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలని హితవు పలికారు.


More Telugu News