కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు.. నదుల అనుసంధానంపై ప్రణాళికలు మాత్రం బాగున్నాయి: చంద్రబాబు

  • వార్షిక బడ్జెట్ ప్రకటించిన కేంద్రం
  • వేతన జీవులకు మొండిచేయి చూపారన్న చంద్రబాబు
  • పేదలు, రైతుల కోసం ఏంచేస్తున్నారో చెప్పలేదంటూ విమర్శలు 
కేంద్ర బడ్జెట్ 2022-23పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని పేర్కొన్నారు. పేదలు, రైతుల కోసం ఏంచేస్తున్నారో బడ్జెట్ లో చెప్పలేదని విమర్శించారు. వార్షిక బడ్జెట్ లో వేతన జీవులకు మొండిచేయి చూపించారని వ్యాఖ్యానించారు.

కాగా, నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలు బాగున్నాయని ప్రశంసించారు. డిజిటల్, సోలార్, విద్యుత్ ఆధారిత వాహనాల రంగంలో సంస్కరణలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇక, బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల సాధనలో వైసీపీ మరోసారి విఫలమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. కాగా, నదుల అనుసంధాన ప్రణాళికను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం స్వాగతించడం తెలిసిందే.


More Telugu News