కేంద్ర బడ్జెట్ తో తగ్గేవి, పెరిగేవి... వివరాలు ఇవిగో!
- పలు రంగాల్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
- దిగుమతులపై సుంకం పెంపు
- చౌకగా మొబైల్ ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు
కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్ ను నేడు ప్రవేశపెట్టారు. 2022-23 బడ్జెట్ తో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అనేక రకాల వస్తువులు చౌకగా లభ్యం కానున్నాయి. మరికొన్ని వస్తువులు ప్రియం కానున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా, కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. ఈ బడ్జెట్ ద్వారా ధరలు తగ్గేవి, పెరిగేవి ఏమిటంటే...
ఇవి చౌకగా లభిస్తాయి..
ధరలు పెరిగేవి...
ఇవి చౌకగా లభిస్తాయి..
- మొబైల్ ఫోన్లు
- మొబైల్ ఫోన్ చార్జర్లు
- మొబైల్ ఫోన్ చార్జింగ్ ట్రాన్స్ ఫార్మర్లు
- వజ్రాలు (కట్ అండ్ పాలిష్డ్), రత్నాలు
- పలు రకాల అనుకరణ ఆభరణాలు (ఇమిటేషన్ జ్యుయెలరీ)
- పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగించే కెమికల్స్
- మిథనాలు, మరికొన్ని రసాయనాలు
- కెమెరా లెన్సులు
- స్టీల్ స్క్రాప్
- వ్యవసాయ పరికరాలు
- దుస్తులు
- పాదరక్షలు
- విదేశీ యంత్ర సామగ్రి
- తోలు వస్తువులు
- వినికిడి పరికరాలు
ధరలు పెరిగేవి...
- అనేక రకాల దిగుమతి వస్తువులు
- విదేశీ గొడుగులు
- క్రిప్టో లావాదేవీలు
- హెడ్ ఫోన్లు
- ఇయర్ ఫోన్లు
- లౌడ్ స్పీకర్లు
- స్మార్ట్ మీటర్లు
- సోలార్ ప్యానెళ్లు
- ఎక్స్ రే మెషీన్లు