సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నిర్మలా సీతారామన్

  • బ్రౌన్, ఎరుపు, తెల్ల అంచు చీరతో ప్రత్యక్షం
  • చేతిలో బడ్జెట్ ట్యాబ్
  • మంత్రికి సిల్క్ చీరలంటే ఎంతో ఇష్టం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు. ఆమె మాతృభాష తమిళం. ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురంకు చెందిన పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకున్నారు. ప్రభాకర్ ప్రముఖ రాజకీయ, ఆర్థికవేత్తగా అందరికీ పరిచయమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగాను పనిచేశారు. వీరిద్దరూ ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించినవారు.

ఇక సంప్రదాయ చీరకట్టులోనే నిర్మలా సీతారామన్ ఎప్పుడూ కనిపిస్తుంటారు. కాకపోతే బడ్జెట్ సందర్భంగా ఆమె కట్టే చీర ఖరీదైన, ప్రత్యేక డిజైన్లతో ఉండడాన్ని గమనించొచ్చు. మంగళవారం బడ్జెట్ ట్యాబ్ తో పార్లమెంటుకు వెళుతున్న సందర్భంగా.. బ్రౌన్, ఎరుపు రంగు చీర, తెల్ల అంచు, తెల్లటి పూలతో ఉన్న చీరను ఆమె ధరించారు. నేత సిల్క్ చీరలంటే ఆమెకు ఎంతో ఇష్టం.

సాధారణంగా బడ్జెట్ పత్రాలను పార్లమెంటుకు తీసుకెళతారు. కానీ, కరోనా నేపథ్యంలో బడ్జెట్ వివరాలను నిక్షిప్తం చేసిన ట్యాబ్ ను ఎర్రటి బుక్ కవర్ తో ఆమె పార్లమెంటుకు తీసుకెళుతూ కనిపించారు. కరోనా వల్ల గతేడాది కూడా పేపర్ లెస్ బడ్జెట్ ను మంత్రి ప్రకటించారు. ఎంపీలకు పత్రాలకు బదులు, ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’ను తీసుకొచ్చారు. ఆ యాప్ ద్వారా బడ్జెట్ వివరాలను సభ్యులు తెలుసుకోవచ్చు.

2021-22 బడ్జెట్ సందర్భంగా మంత్రి క్రిస్ప్ రెడ్ రంగు చీర, తెల్ల అంచుతో ఉన్న చీరను ధరించారు. 2020-21 బడ్జెట్ సమయంలో ప్రిస్టిన్ ఎల్లో గోల్డ్ సిల్క్ చీర, బ్లూ అంచుతో ఉన్న చీరను ఆమె ధరించడం గమనార్హం.


More Telugu News