పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు.. రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు.. కేంద్ర బడ్జెట్ హైలైట్స్ - 3

  • 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ. 39 లక్షల కోట్లు
  • బడ్జెట్ ద్రవ్యలోటు 6.9 శాతం
  • క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ. 39 లక్షల కోట్లు.
  • బడ్జెట్ లో ద్రవ్యలోటు 6.9 శాతం.
  • 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడమే లక్ష్యం.  
  • స్టార్టప్ లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగింపు.
  • సహకార సంస్థల పన్ను 15 శాతానికి తగ్గింపు. సహకార సంస్థల పన్నుపై సర్ఛార్జీ 7 శాతానికి తగ్గింపు.
  • క్రిప్టో కరెన్సీలకు పన్ను మినహాయింపు ఉండదు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను.
  • ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు. జనవరి జీఎస్టీ వసూళ్లు రూ. 1,40,986 కోట్లు.
  • ట్యాక్స్ రిటర్నులకు రెండేళ్ల సమయం. రిటర్నుల్లో లోపాలను సరిదిద్దుకోవడానికి ట్యాక్స్ పేయర్స్ కు అవకాశం.
  • పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు.
  • ఇకపై సులభతరంగా ఐటీ ఫైలింగ్. 80సీ, 80డీ సెక్షన్లలో ఎలాంటి మార్పు లేదు.
  • కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ తయారీ సంస్థలకు పన్ను మినహాయింపు.
  • రక్షణ రంగంలో పరిశోధనల కోసం ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహం.
  • సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ. 19,500 కోట్లు.
  • రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు.
  • డిజిటల్ అస్సెట్స్ బదిలీలపై 30 శాతం పన్ను. గిఫ్ట్ రూపంలో తీసుకునే వాటిపై కూడా పన్ను.
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్). రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం.
  • గంగా తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రియ సాగు.
  • వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్ లు.
  • కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశం. బిల్లుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో చూసుకునే అవకాశం.
  • ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
  • పీపీపీ మోడల్ లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం.


More Telugu News