ఒక్కో రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ఉత్పత్తికి శ్రీకారం
- స్థానికంగా ఉపాధి అవకాశాల వెల్లువ
- బడ్జెట్ లో ప్రకటించిన మంత్రి నిర్మల
- 400 వందే భారత్ రైళ్లు పట్టాలపైకి
ఇక మీదట ప్రాంతీయ ఉత్పత్తులకు దేశవ్యాప్త ప్రచారం తీసుకు వచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒక్కో రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ఉత్పత్తికి ప్రచారం, ప్రోత్సాహం కల్పిస్తారు. రైల్వే శాఖ వీటిని అభివృద్ధి చేస్తుంది. తద్వారా స్థానిక వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేయవచ్చన్నది కేంద్రం ఆలోచన.
ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రకటించారు. అలాగే, 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామని తెలిపారు. వందే భారత్ రైలు 16 కోచ్ లతో అత్యాధునికంగా, బుల్లెట్ రైలును పోలి ఉంటుంది. ఇప్పటి వరకు రెండు వందే భారత్ రైళ్లను తయారు చేసి ఢిల్లీ-వారణాసి మార్గంలో ఒకటి, ఢిల్లీ-కాత్రా మార్గంలో మరొక దాన్ని నడిపిస్తున్నారు.