కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధం... కేంద్ర బడ్జెట్ హైలైట్స్ -1
- 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను రూపొందించాం
- జాతీయ రహదారులను 25 వేల కిలోమీటర్లకు పెంచుతాం
- వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని మంత్రి అన్నారు. కేంద్ర బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడుతుండటం ఇది నాలుగోసారి.
బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:
బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:
- కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే విశ్వాసం మనకుంది.
- ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
- వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించాం.
- పేద, మధ్య తరగతి పురోగతి కోసం కృషి చేస్తున్నాం.
- సాంకేతిక ఆధారిత అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాం.
- జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్లకు పెంచుతాం.
- అత్యాధునిక వసతులతో కొత్త వందే భారత్ రైళ్లు. కవచ్ పథకం కింద 2 వేల కిలోమీటర్లు. 400 కొత్త జనరేషన్ వందే భారత్ రైళ్లు. 100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్.
- దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు.
- పర్వతమాల ప్రాజెక్టు కింద 8 రోప్ వేల నిర్మాణం. 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం.
- డ్రోన్ టెక్నాలజీని పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం.
- ఎయిర్ ఇండియా బదిలీ సంపూర్ణంగా పూర్తయింది.
- సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలను అందిస్తాం.
- తృణ ధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
- 2023ను తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం.
- వరి, గోధుమ మద్దతు ధర చెల్లింపులకు రూ. 2.7 లక్షల కోట్లు.
- రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు పథకం.
- ప్రాంతీయ భాషల్లో విద్యాభివృద్ధికి టీవీ ఛానెళ్లు.
- డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీ.
- వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన.
- ఆత్మ నిర్భర్ భారత స్ఫూర్తితో 16 లక్షల ఉద్యోగాలను కల్పించాం.
- ఎయిర్ ఇండియా బదిలీని సంపూర్ణంగా పూర్తి చేశాం.
- రైల్వేలో సరకుల రవాణాకు సరికొత్త పథకం.
- కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధమైంది.