'శాకుంతలం' కోసం చాలా కష్టపడ్డానంటున్న విలన్!
- 'శాకుంతలం'లో కీలక పాత్ర చేశాను
- బరువైన కిరీటం మోయడం కష్టమైంది
- గుణశేఖర్ గొప్ప దర్శకుడంటూ ప్రశంసలు
- తన పాత్రకి మంచి పేరు వస్తుందన్న కబీర్ దుహాన్ సింగ్
గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో దేవ్ మోహన్ ఆమె జోడీగా కనిపించనున్నాడు. ఇక కీలకమైన అసుర మహారాజు పాత్రలో కబీర్ దుహాన్ సింగ్ కనిపించనున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్ర హీరో పాత్రతో పోరాడుతుంది. పది కేజీల బరువుండే కిరీటం పెట్టారు. బరువైన ఆభరణాలను నా మెడలో వేశారు. కిరీటం జారిపోకుండా చూసుకుంటూ .. ఆ బరువును మోస్తూ కత్తి యుద్ధం చేయవలసి ఉంటుంది. అలవాటు లేకపోవడం వలన నేను చాలా ఇబ్బందిపడ్డాను.
గుణశేఖర్ గారు నిజంగా చాలా గొప్ప డైరెక్టర్. ఆర్టిస్టుల నుంచి తనకి కావలసిన అవుట్ పుట్ ను రాబట్టే తీరు నాకు బాగా నచ్చింది. సమంత - దేవ్ మోహన్ కూడా బాగా చేశారు. ఈ సినిమా కోసం నేను పని చేసిన ప్రతి రోజు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నన్ను నేను కొత్తగా చూసుకునే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.