మెగాస్టార్ సరసన మాళవిక మోహనన్?

మెగాస్టార్ సరసన మాళవిక మోహనన్?
  • మాళవిక మోహనన్ కి మంచి క్రేజ్
  • సోషల్ మీడియాలో చాలా యాక్టివ్
  • ధనుశ్ జోడీగా చేసిన 'మారన్'
  • వెంకీ కుడుముల ఎంపిక చేశాడంటూ టాక్!
మాళవిక మోహనన్ తెలుగులో ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది .. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అందువలన మాళవిక మోహనన్ గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.

అయితే ఇప్పుడు ఆమె తెలుగులో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు .. అదీ మెగాస్టార్ సరసన. చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన చిరంజీవి సరసన నాయికగా మాళవిక మోహనన్ ను పరిచయం చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో మాళవిక మోహనన్ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తాజా చిత్రంగా ధనుశ్ తో చేసిన 'మారన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. 'భోళాశంకర్'లో తమన్నా .. 'వాల్తేరు వీర్రాజు'లో శ్రుతి హాసన్ .. ఈ సినిమాలో మాళవిక మోహనన్ చిరూ సరసన సందడి చేయనున్నారన్న మాట.


More Telugu News