ఆ పని చేయడానికి కెప్టెనే కానవసరం లేదు: కోహ్లీ

  • ఒక బ్యాట్స్ మెన్ గా ఇకపై జట్టుకు సేవలందిస్తా
  • కెప్టెన్ గా నా బాధ్యత పూర్తయింది
  • సరైన సమయంలో తప్పుకోవడం కూడా నాయకత్వ లక్షణాల్లో ఒక భాగం
కెప్టెన్ గా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతలకు దూరమైన సంగతి తెలిసిందే. ఓ బ్యాట్స్ మెన్ గా ఇకపై ఆయన జట్టుకు సేవలందించనున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాలంటే కెప్టెనే కానవసరం లేదని కోహ్లీ అన్నాడు. ఒక బ్యాట్స్ మెన్ గా ఇకపై జట్టుకు విజయాలను అందిస్తానని తెలిపాడు. కెప్టెన్సీ నుంచి తాను ఎందుకు వైదొలిగానని ఎంతో మంది అనుకుంటూ ఉండొచ్చని... అయితే, ప్రతి దానికి ఒక సమయం ఉంటుందని కోహ్లీ అన్నాడు. కెప్టెన్ గా తాను నిర్వహించాల్సిన బాధ్యత పూర్తయింది అనుకుని ముందుకు సాగుతానని చెప్పాడు. ఒక బ్యాట్స్ మెన్ గా జట్టుకు ఇంకా ఎక్కువ ఇస్తానేమో అని సరదాగా వ్యాఖ్యానించాడు.

ధోనీ కూడా ఇదే మాదిరి ఉన్నాడని... కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అలాంటి భావన రాకుండా... అన్ని విషయాల్లో భాగస్వామి అవుతూ, సమయానుకూలంగా సలహాలు ఇచ్చేవాడని తెలిపాడు. సరైన సమయంలో తప్పుకోవడం కూడా నాయకత్వ లక్షణాల్లో ఒక భాగమని చెప్పాడు. ఎలాంటి బాధ్యతలను నిర్వహించేందుకైనా సిద్ధంగా ఉండాలని అన్నాడు.


More Telugu News