హైదరాబాద్ వాసులు మరో రెండు రోజులు ‘వణకాల్సిందే!’
- జీహెచ్ఎంసీ పరిధిలోని 15 సర్కిళ్లలో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు
- శేరిలింగంపల్లిలో అత్యంత కనిష్ఠంగా 8.8 డిగ్రీలు
- మూడు రోజుల తర్వాత నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్రతలు జనాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. ఫలితంగా జనం చలికి వణుకుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 సర్కిళ్లలో నిన్న 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శేరిలింగంపల్లిలో అత్యంత కనిష్ఠంగా 8.8 డిగ్రీలు నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా సర్కిళ్లలో 10 నుంచి 15 డిగ్రీల మధ్య రికార్డయింది. నగరంలో మరో రెండు రోజులపాటు చలి తీవ్రత ఇలానే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందని వాతావరణశాఖ పేర్కొంది.