అఖిలపక్ష సమావేశం నిర్వహించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు... హాజరైన విజయసాయి

  • పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
  • వర్చువల్ సమావేశం నిర్వహించిన వెంకయ్య
  • ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామన్న విజయసాయి
  • కులాల వారీగా గణన చేపట్టాలని విజ్ఞప్తి
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వర్చువల్ గా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, కొవిడ్ సంక్షోభం నెలకొన్నందున రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కోరారు. ఈసారి చేపట్టే జనాభా లెక్కల సేకరణలో కులాల వారీగా గణన జరపాలని విజ్ఞప్తి చేశారు.

వైజాగ్ ఉక్కు పరిశ్రమ, ఎల్ఐసీ, బీపీసీఎల్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని విజయసాయి స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించిన లేఖలోని అంశాలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగేలా చూడాలని, సభను అడ్డుకునేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెగాసస్ అంశం సామాన్య ప్రజలకు సంబంధించిన అంశం కాదని అభిప్రాయపడ్డారు.


More Telugu News