తగ్గేదేలేదంటున్న ఏపీ ఉద్యోగులు... సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించిన వైద్యారోగ్య శాఖ జేఏసీ!
- తీవ్రతరమవుతున్న ఏపీ ఉద్యోగుల ఆందోళన
- సమ్మెలో పాల్గొంటామని ప్రకటించిన వైద్యారోగ్య శాఖ జేఏసీ
- ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పని చేస్తున్నా సమస్యలను ఎదుర్కొంటున్నామని మండిపాటు
పీఆర్సీకి వ్యతిరేకంగా ఏపీలో ఉద్యోగుల ఆందోళన తీవ్రతరమవుతోంది. ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ వారు ఏమాత్రం తగ్గడం లేదు. డిమాండ్ సాధన విషయంలో తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చి చెపుతున్నారు.
మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు చేపడుతున్న సమ్మెకు తాము కూడా వెళ్లాలని వైద్యారోగ్య శాఖ జేఏసీ నిర్ణయించింది. ఈరోజు జేఏసీ నేతలు ఈ మేరకు ప్రకటన చేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పని చేస్తున్నా, ప్రభుత్వం వైపు నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని పీఆర్సీ సాధన సమితి నేత ఆస్కార్ రావు తెలిపారు. వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించడం దారుణమని అన్నారు. తాము ఎలా వైద్యం చేయాలో జేసీలు చెపుతుంటే తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని మండిపడ్డారు.