చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు రాకుండా ద్వితీయశ్రేణి వాళ్లను పంపించారు: బొత్స

  • ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమన్న మంత్రి
  • అందుకే సీఎం కమిటీ వేశారని వివరణ
  • మూడ్రోజులు చూసినా ఉద్యోగులు రాలేదని ఆరోపణ
  • ఇష్టానుసారం మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదన్న బొత్స 
ఏపీలో కొత్త జీవోల ప్రకారమే జీతాలు వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగులకు సీఎం జగన్ అన్యాయం చేయబోరని ఉద్ఘాటించారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడం కోసమే ముఖ్యమంత్రి కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

అయితే మూడు రోజులు ఎదురుచూసినా ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రాలేదని బొత్స ఆరోపించారు. వారు రాకపోగా ద్వితీయశ్రేణి వాళ్లను పంపించారని వివరించారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవాలని, ఏ డిమాండ్ అయినా సరే సమంజసంగా ఉండాలని హితవు పలికారు. ఇష్టానుసారం మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదని, అందుకు ఉద్యోగులే బాధ్యత వహించాల్సి ఉంటుందని బొత్స స్పష్టం చేశారు.


More Telugu News