ఇంగ్లండ్ పై గెలిచాం... ఇక టీమిండియాను కూడా ఓడిస్తాం: పొలార్డ్ ధీమా

  • ఇంగ్లండ్ తో 5 టీ20లు ఆడిన విండీస్
  • 3-2తో సిరీస్ కైవసం
  • పొలార్డ్ నాయకత్వంలో రాణించిన విండీస్
  • ఫిబ్రవరి 6 నుంచి భారత్ లో విండీస్ టూర్
  • 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న కరీబియన్లు
సొంతగడ్డపై ఇంగ్లండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను వెస్టిండీస్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్ స్పందించాడు. బలమైన ఇంగ్లండ్ ను ఓడించామని, ఇక టీమిండియాను కూడా చిత్తు చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. భారత పర్యటనలో భాగంగా విండీస్ 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి వన్డే ఫిబ్రవరి 6న జరగనుంది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియాతో ఆడేందుకు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పొలార్డ్ తెలిపాడు. ప్రస్తుతం తమ దృష్టి అంతా భారత పర్యటనపైనే ఉందని పేర్కొన్నాడు. కాగా, ఇంగ్లండ్ తో ఐదో టీ20 ముగిసిన అనంతరం పొలార్డ్ మీడియాతో మాట్లాడుతూ పాట పాడడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.


More Telugu News