నాకు గంభీర్‌తో గొడవల్లేవు.. ఇషాంత్‌తో శత్రుత్వం లేదు: పాక్ క్రికెటర్ అక్మల్
- గౌతమ్ గంభీర్ చాలా మంచి వ్యక్తి
- గతంలో తప్పుగా అర్థం చేసుకున్నాను
- గంభీర్‌తో ఆసియా కప్ మ్యాచ్‌లో చిన్న పొరపాటు జరిగింది
- బెంగళూరులో ఇషాంత్‌తోనూ వివాదం తలెత్తింది
టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ చాలా మంచి వ్యక్తని పాకిస్థాన్ క్రికెటర్ కమ్రన్ అక్మల్ అన్నాడు. 2010 ఆసియాకప్‌లో ఇరు దేశాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోన్న సమయంలో గంభీర్ ఆడబోయిన బాల్‌ను వికెట్ల వెనుకున్న పాక్ కీపర్ క్యాచ్ అందుకున్నాడు. దాన్ని అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీనిపై టీ బ్రేక్ సమయంలో అక్మల్ వద్దకు గంభీర్ వెళ్లి ఆ బంతి తన బ్యాట్‌కు తాకలేదని చెప్పాడు.
దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే, దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యలో అక్మల్ స్పందిస్తూ... గంభీర్‌తో తనకు ఎలాంటి గొడవలూ లేవని చెప్పాడు. అప్పట్లో తాను గంభీర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పాడు. గంభీర్‌తో ఆసియా కప్ మ్యాచ్‌లో చిన్న పొరపాటు జరిగిందని, గంభీర్ ఔటయ్యాడని తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పాడు.
అలాగే, బెంగళూరులో ఇషాంత్‌తో జరిగిన వివాదంలోనూ తనకెలాంటి శత్రుత్వం లేదని అక్మల్ అన్నాడు. కాగా, టీమిండియాలో ఇర్ఫాన్ ఖాన్ కంటే జహీర్ ఖానే డేంజర్ అని, అతడే బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అని అక్మల్ చెప్పాడు. తన అభిప్రాయం ప్రకారం అత్యుత్తమ వికెట్ కీపర్‌లు రషీద్ లతీఫ్, ఆడం గిల్‌క్రిస్ట్ అని ఆయన అన్నాడు. అలాగే, గత 15 ఏళ్లలో మహేంద్రసింగ్ ధోనీ బెస్ట్ కీపర్ అని తెలిపాడు.