రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు
- తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు నిర్ణయం
- కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరుకి నిరసన
- విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరుకి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. విభజన హామీలతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు విడుదల చేయాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పోరాడతామని తెలిపారు.