మీ తర్వాత వచ్చిన పిల్లలంతా పాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు: పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వర్మ వరుస ట్వీట్లు
- తారక్, చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారు
- 'భీమ్లా నాయక్' ని పాన్ ఇండియాగా విడుదల చేసి.. పవర్ ప్రూవ్ చేయండి
- లేకపోతే బన్నీ ఫ్యాన్స్ కి మేము సమాధానం చెప్పలేం
జనసేనాని పవన్ కల్యాణ్ ను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి టార్గెట్ చేశారు. మీకన్నా వెనకొచ్చిన పిల్లలంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోతుంటే... మీరు ఇక్కడే వేలాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన పవన్ పై వరుస ట్వీట్లు చేశారు.
ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తారక్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోతూ ఉంటే... మీరు ఇంకా ఒట్టి తెలుగుని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటిప్రాయంగా ఉందని వర్మ అన్నారు. దయచేసి 'భీమ్లా నాయక్'ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లి... మీరే సబ్ కా బాప్ అని ప్రూవ్ చేయండని వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైమ్ లో పెట్టానని... ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్ మాత్రం తన కాఫీ టైమ్ లో పెడుతున్నానని.. దీన్ని బట్టి తన సీరియస్ నెస్ అర్థం చేసుకోండి పవన్ కల్యాణ్ అని అన్నారు. 'పుష్ప' సినిమానే అంత చేస్తే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయిన మీరు నటించిన 'భీమ్లా నాయక్' ఇంకెంత వసూలు చేస్తుందో చెప్పాలని వర్మ అన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా రిలీజ్ చేయకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి సమాధానం చెప్పలేమని సెటైర్ వేశారు.
'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాను హిందీలో విడుదల చేయొద్దు, వర్కవుట్ కాదని తాను ట్విట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదని... దీని ఫలితం ఏంటో మీరు చూశారని వర్మ అన్నారు. ఇప్పడు తాను మళ్లీ చెపుతున్నానని... 'భీమ్లా నాయక్'ను ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చేయాలని, పవర్ ప్రూవ్ చేయాలని సూచించారు.