శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి... పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం.. హైలైట్స్-2!
- దేశంలో 6 కోట్ల నివాసాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం
- జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా లక్ష కోట్లు దాటుతున్నాయి
- దేశ భద్రతకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా తొలుత ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది పేదలకు పక్కా గృహాలను నిర్మించాం.
- దేశంలోని 6 కోట్ల నివాసాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం.
- వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చాం.
- 1,900 కిసాన్ రైళ్లు 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను తరలించాయి.
- నదుల అనుసంధానం దిశగా నా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
- మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాం.
- బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. స్కూళ్లకు వెళ్తున్న అమ్మాయిల సంఖ్య పెరిగింది.
- ఇండియాలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తున్నాయి.
- కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్లకు పైగానే ఉన్నాయి.
- చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల కొల్లేటరల్ ఫ్రీ లోన్లను ఇచ్చాం.
- ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తుల జాబితాలో భారత్ మరోసారి నిలిచింది.
- టోక్యో ఒలింపిక్స్ లో భారత యువత సత్తా చాటడం చూశాం.
- దేశంలో 36,500 కిలోమీటర్ల రహదారులను నిర్మించాం.
- డ్రోన్ టెక్నాలజీలో దూసుకుపోతున్నాం.
- దేశ భద్రతకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- మేకిన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి ప్రాధాన్యతను ఇస్తున్నాం.
- ఎన్నో సమస్యలు ఎదురైనా కాబూల్ నుంచి భారతీయులను, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలను తీసుకొచ్చాం.
- యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో దుర్గా పూజకు స్థానం కల్పించేలా చేశాం.
- 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్ ను టార్గెట్ గా పెట్టుకున్నాం.
- జమ్మూలో ఐఐటీ, ఐఐఎం నిర్మిస్తున్నాం.
- శ్రీనగర్-షార్జా అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి.
- ఒకప్పుడు దేశవ్యాప్తంగా 126 నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఉండగా... ఇప్పుడు వాటి సంఖ్య 70కి తగ్గింది.
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రాల్లో రోడ్డు, రైల్ కనెక్టివిటీని పెంచాం. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ లో ఇప్పుడు అత్యాధునిక ఎయిర్ పోర్టు ఉంది.