విభజన చట్టం హామీలన్నీ నెరవేర్చండి... బడ్జెట్ ముంగిట ప్రధాని మోదీకి కేటీఆర్ విజ్ఞప్తి
- జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటన
- ప్రధాని మోదీని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్
- వాస్తవికతను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలని సూచన
రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారని కేటీఆర్ ప్రస్తావించారు. అలాగే ఇంటింటికీ నీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని వివరించారు.
విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. హామీలకు న్యాయం చేసేలా బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్ పేర్కొన్న మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు అందజేయాలని కోరారు. 2022 బడ్జెట్ లో కేటాయింపులు వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటాయని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.