కళ్లు తెరచి చూస్తున్న లతా మంగేష్కర్.. ఇంకా తగ్గని ఇన్ ఫెక్షన్.. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రకటన
- డాక్టర్లతో మాట్లాడుతున్నారన్న రాజేశ్ తోపే
- వెంటిలేటర్ ను తీసేశారని వెల్లడి
- బలహీనంగా ఉన్నారన్న మంత్రి
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటన చేశారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఆమె ఆరోగ్యం చాలా వరకు నయమైందని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే కళ్లు తెరచి చూస్తున్నారని తెలిపారు. అయితే, ఆమె ఇంకా బలహీనంగానే ఉన్నారని, ఇన్ ఫెక్షన్ ఇంకా ఉందని చెప్పారు. జనవరి 8న లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ఆసుపత్రిలోనే ఉండడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ కు చికిత్స చేస్తున్న వైద్యుడితో తాను మాట్లాడానని రాజేశ్ తోపే చెప్పారు. 15 రోజులుగా ఆమె వెంటిలేటర్ పై ఉందని, ఇప్పుడు ఆమెకు వెంటిలేటర్ అవసరం లేదంటూ డాక్టర్ చెప్పారని ఆయన వెల్లడించారు. లత కోలుకుంటున్నారన్న మంచి వార్త చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం ఆక్సిజన్ ను ఆమెకు అందిస్తున్నారన్నారు. కళ్లు తెరచి డాక్టర్లతో మాట్లాడగలుగుతోందని తెలిపారు. చికిత్సకు స్పందిస్తోందని వివరించారు.