భీమిలిలో రిసార్ట్‌లో పేకాట.. 22 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు
- రిసార్టులో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో దాడులు
- పెద్ద ఎత్తున నగదు స్వాధీనం
- తొమ్మిది కార్లు, 23 సెల్‌ఫోన్లు కూడా సీజ్
ఈ రోజు తెల్లవారుజామున విశాఖ జిల్లా భీమిలి శివారులోని ఓ రిసార్ట్‌లో కొందరు పేకాట నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు అక్కడకు వెళ్లి మెరుపుదాడి చేసి పేకాడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు.
అలాగే, తొమ్మిది కార్లు, 23 సెల్‌ఫోన్లను కూడా సీజ్ చేశారు. అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో విశాఖ నగరానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. పేకాటరాయుళ్లు నగదుకు బదులు కాయిన్స్ కూడా వినియోగించినట్లు పోలీసులు చెప్పారు. మొత్తం డబ్బే వాడితే దొరికిపోతామన్న భయంతో వాటికి బదులుగా కాయిన్స్ వాడినట్లు వివరించారు.