జేఈఎమ్ కమాండర్ జాహిద్ వనీ సహా ఐదుగురు ఉగ్రవాదుల హతం
- పుల్వామాలోని నైరా, బుద్గామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్
- మరో పాకిస్థానీ ఉగ్రవాది కోసం గాలింపు
- భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జేఈఎమ్ కమాండర్ జాహిద్ వనీ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని పోలీసులు తెలిపారు. పుల్వామాలోని నైరా ప్రాంతంలో, బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడే ప్రయత్నం చేయడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదులంతా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారని పోలీసులు వివరించారు. తప్పించుకుపారిపోయిన మరో పాకిస్థానీ ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని వివరించారు.