మరోసారి సుప్రీంకోర్టుకు పెగాసస్ వ్యవహారం
- పెగాసస్‌పై మరో పిటిషన్ దాఖలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలి
- ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి
- న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని పేర్కొన్న పిటిషనర్
మరోసారి సుప్రీంకోర్టుకు పెగాసస్ వ్యవహారం చేరింది. దానిపై మరో పిటిషన్ దాఖలైంది. పెగాసస్‌పై భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను ఎంఎల్ శర్మ అనే న్యాయవాది దాఖలు చేశారు.
పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, 2017లో ఇజ్రాయెల్ తో పెగాసస్‌పై డీల్ జరిగిందంటూ న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన కథనం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.