ఏపీలోని కొత్త పెన్షనర్లకు రూ. 5 వేల నుంచి 15 వేల వరకు తగ్గుదల

  • సవరించిన పీఆర్సీ నిబంధనలు అమలు కాని వైనం
  • 1 జులై 2018 తర్వాత పదవీ విరమణ చేసిన వారిలో అయోమయం
  • కొన్ని నెలలపాటు ఇదే తీరు
  • ఆ తర్వాత కోత పడిన పింఛను మొత్తం ఎరియర్లుగా చెల్లింపు
గతేడాది డిసెంబరు నెల పింఛనుతో పోలిస్తే ఉద్యోగ స్థాయిని బట్టి రూ. 5 వేల నుంచి రూ. 15 వరకు తగ్గిపోతుండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022 సవరించిన పీఆర్సీ నిబంధనల ప్రకారం 1 జులై 2018 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి కొత్త పెన్షన్ స్కేల్ ప్రకారం పింఛను ఇవ్వడం లేదు. అలాగని, గత డిసెంబరు నాటి మొత్తమూ రాలేదు. దీంతో కొత్త పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత ఉద్యోగులు కొత్త పీఆర్సీకి సహకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో విశ్రాంత ఉద్యోగుల పింఛను లెక్కలు సిద్ధం చేసి ఏజీ కార్యాలయానికి పంపడం ఆలస్యమవుతోంది. ఫలితంగా కొన్ని నెలలపాటు ఇలా కోతపడిన పింఛన్లే అందే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం 2022 పీఆర్సీ ప్రకారం పింఛను లెక్కించి, కోత పడిన పెన్షన్‌ను కలిపి ఎరియర్స్‌గా చెల్లిస్తారు. కాగా, పీఆర్సీ చరిత్రలో ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గడం ఇదే తొలిసారి.


More Telugu News