అండర్ 19 ప్రపంచకప్: సెమీస్‌కు యువ భారత్
- డిఫెండింగ్ చాంపియన్ బంగ్లా చిత్తు
- బంతితో బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించిన భారత్
- 5 వికెట్ల తేడాతో విజయం
అండర్ 19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ 2 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ అప్పగించిన భారత జట్టు బంతితో చెలరేగిపోయింది. ముఖ్యంగా రవికుమార్, విక్కీ ఓస్వాల్ బౌలింగ్ దాడి ముందు బంగ్లా బ్యాటర్లు నిలవలేకపోయారు. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. ఫలితంగా 37.1 ఓవర్లలో 111 పరుగులకే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. ఆ జట్టులో ఎస్ఎం మెహరోబ్ చేసిన 30 పరుగులే అత్యధికం. భారత బౌలర్లలో రవికుమార్ మూడు వికెట్లు తీసుకోగా, విక్కీకి 2, కౌశల్ తాంబే, రాజ్‌వర్ధన్, రఘువంశీలకు తలా వికెట్ దక్కింది.
అనంతరం 112 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 30.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. రఘువంశీ 44, షేక్ రషీద్ 26, కెప్టెన్ యశ్ ధుల్ 26 (నాటౌట్) పరుగులు చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిపన్ మండల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తంజీమ్ హసన్ సకీబ్‌కు ఒక వికెట్ దక్కింది. మూడు వికెట్లు తీసి బంగ్లాను దెబ్బకొట్టిన రవికుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.