'ఆర్ఆర్ఆర్' కోసం నా సినిమాలు వాయిదా వేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు: దిల్ రాజు
- టాలీవుడ్ రేంజ్ పెరగాలన్న దిల్ రాజు
- పాన్ ఇండియా సినిమాలు విడుదల కావాలని ఆకాంక్ష
- ఇండస్ట్రీ కోసం త్యాగం చేస్తానని వెల్లడి
- ఎఫ్3ని వాయిదా వేసుకునేందుకు సిద్ధమని స్పష్టీకరణ
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాలు విడుదల అవ్వాలని, చిత్ర పరిశ్రమ రేంజ్ మరింత పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమాల కోసం తన సినిమాలు వాయిదా వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
"ఆర్ఆర్ఆర్ విడుదలకు రెండు తేదీలు (మార్చి 18 లేదా, ఏప్రిల్ 28) ప్రకటించారు. మా ఎఫ్3 చిత్రాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ 28నే వచ్చేట్టయితే మా ఎఫ్3 విడుదలను వాయిదా వేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు" అని స్పష్టం చేశారు.
అయితే అందరూ కూర్చుని విడుదల తేదీలపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందని, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాలకు ఎలాంటి అవాంతరాలు ఉండరాదని దిల్ రాజు పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ మేలు కోసం తాను ఏదైనా చేస్తానని ఉద్ఘాటించారు.