మరి కొన్నిరోజుల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు... ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు
- ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు
- ఏడు దశల్లో పోలింగ్
- మార్చి 7 వరకు ఎగ్జిట్ పోల్స్ వద్దన్న ఈసీ
- మార్చి 10న ఓట్ల లెక్కింపు
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ పై ఆంక్షలు విధించింది. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 7వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 7వ తేదీ సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాలని ఈసీ స్పష్టం చేసింది.