ఈ ముగ్గురు భారత బ్యాట్స్ మెన్ తో హ్యాట్రిక్ చేయాలన్నది నా కల: షహీన్ అఫ్రిది
- క్రికెట్ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అఫ్రిది
- కోహ్లీ వికెట్ ఎంతో ప్రత్యేకం అని వెల్లడి
- గత సీజన్ లో విశేషంగా రాణించిన పాక్ పేసర్
- ఐసీసీ ఈ ఏటి మేటి క్రికెటర్ గా ఎంపిక
పాకిస్థాన్ సెన్సేషనల్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. భారత అగ్రశ్రేణి ఆటగాళ్లను తన పదునైన బంతులతో కకావికలం చేయాలని కోరుకుంటున్నానని వెల్లడించాడు. ముఖ్యంగా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను వరుస బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాలన్నది తన కల అని తెలిపాడు.
ఓ క్రికెట్ వెబ్ సైట్ తో '25 ప్రశ్నలు-జవాబులు' కార్యక్రమం సందర్భంగా షహీన్ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, తన కెరీర్ లో ఇప్పటివరకు తీసిన వికెట్లలో కోహ్లీని అవుట్ చేయడం ప్రత్యేకం అని స్పష్టం చేశాడు.
షహీన్ అఫ్రిది గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై సంచలన ప్రదర్శన చేయడం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లను తొలి స్పెల్ లో అవుట్ చేసిన అఫ్రిది... ఆ తర్వాత స్పెల్ లో కోహ్లీని తిప్పిపంపాడు. అయితే అది హ్యాట్రిక్ మాత్రం కాదు. కానీ, అఫ్రిది వేసిన ఆ ఓవర్లే టీమిండియాను కట్టడి చేశాయి.
భారత్ పైనే కాదు, 2021లో ఈ పొడగరి పేసర్ నిప్పులు చెరిగే బంతులతో అనేక దేశాల బ్యాట్స్ మెన్ పనిబట్టాడు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా ఐసీసీ ఈ ఏటి మేటి క్రికెటర్ పురస్కారానికి షహీన్ అఫ్రిదిని ఎంపిక చేసింది.