ఏఎన్నార్ జిల్లాను ఏర్పాటు చేయాలంటూ ఏపీలో సరికొత్త డిమాండ్!
- మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టాలని డిమాండ్
- సినీ పరిశ్రమలో అత్యున్నత శిఖరాలకు ఎదిగారంటున్న అభిమానులు
- జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టి ఆయనను గౌరవించాలని విన్నపం
ఏపీలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాల విషయంలో కొన్ని చోట్ల అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. జనాలు నిరసన కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లా, శ్రీసత్యసాయి జిల్లా వంటి పేర్లను రాష్ట ప్రభుత్వం కొన్ని జిల్లాలకు ప్రకటించింది. మరోవైపు వంగవీటి రాధ, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న జిల్లాకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అభిమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గుడివాడ సమీపంలోని రామాపురంలో పుట్టిన అక్కినేని... సినీ పరిశ్రమలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారని వారు గుర్తుచేస్తున్నారు. చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారని... దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారని చెప్పారు. అలాంటి దిగ్గజ నటుడి పేరును జిల్లాకు పెట్టడం ద్వారా ఆయనకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.