టైం ఇస్తున్నా... ఏం చేస్తారో చేసుకోండి: రఘురామకృష్ణరాజు
- అనర్హత వేటు విషయంలో ఫిబ్రవరి 11 వరకు సమయం ఇస్తున్నానన్న రఘురాజు
- వివేకా హత్య కేసులో నిందితుడి తరపున ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారని ఆరోపణ
- ప్రభుత్వంపై అమరావతి రైతులు కేసులు పెట్టాలని సూచన
ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. తన అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు ముఖ్యమంత్రి జగన్ కు సమయం ఇస్తున్నానని... ఈలోగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ చేశారు.
ఇక దివంగత వైయస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో పురోగతి వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి తరపున ప్రభుత్వ లాయర్ చంద్ర ఓబుల్ రెడ్డి వాదించారని... వైసీపీ నేత తరపున ప్రభుత్వ లాయర్ ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఓబుల్ రెడ్డిపై బార్ కౌన్సిల్ ఛైర్మన్ కు లేఖ రాశానని తెలిపారు. హూ కిల్డ్ బాబాయ్ అనే విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు.
అమరావతి రాజధాని విషయంలో మోసం చేసినందుకు ప్రభుత్వంపై రైతులు కేసులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. అమరావతి రైతులకు కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగులంతా తమ హక్కుల సాధన కోసం పోరాడాలని సూచించారు.