భారత జట్టు సరైనోడి చేతుల్లోకే వెళ్లింది.. రోహిత్ మేటి కెప్టెన్ అంటూ వెస్టిండీస్ మాజీ సారథి ప్రశంసలు
- జట్టు గురించి కలవరం అవసరం లేదు
- ఆటగాళ్ల ప్రతిభను వెలికితీయగలడు
- స్ఫూర్తిమంతమైన కెప్టెన్ అంటూ ప్రశంస
- కోహ్లీ అమూల్యమైన ఆటగాడంటూ కితాబు
రోహిత్ శర్మ మేటి సారథి అని, భారత క్రికెట్ జట్టు సరైనోడి చేతుల్లోకే వెళ్లిందని వెస్టిండీస్ మాజీ సారథి, జట్టుకు రెండు వరల్డ్ కప్ లు అందించిన డారెన్ సామీ అన్నాడు. ధోనీ లాగానే.. జట్టులోని ఆటగాళ్ల నుంచి ప్రతిభను వెలికి తీస్తాడని చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి భారత్ తో వెస్టిండీస్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సామీ స్పందించాడు.
‘‘రోహిత్ ఓ గొప్ప కెప్టెన్. స్ఫూర్తిమంతమైన నాయకుడు. ఐపీఎల్ లో ముంబైకి కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను చాలా దగ్గర్నుంచి చూశాను. ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్ వంటి గొప్ప కెప్టెన్. వీళ్లంతా కూడా తమ జట్టు ఆటగాళ్ల నుంచి ప్రతిభను వెలికితీసి కప్పులు గెలవగల సమర్థులు. కాబట్టి రోహిత్ చేతుల్లోకి వెళ్లిన జట్టు గురించి కలవరపడాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించాడు. కోహ్లీపైనా ప్రశంసలు కురిపించాడు. అతడు కెప్టెన్ కాకపోయినా అమూల్యమైన ఆటగాడన్నాడు.